This changing weather, protect your family with big discounts! Use code: FIRST10This changing weather, protect your family with big discounts! Use code: FIRST10
ADDED TO CART SUCCESSFULLY GO TO CART
Track your parenting journey

గర్భవతిగా ఉన్నప్పుడు టమాటాలు తినటం : లాభాలు & రిస్కులు (Tomato During Pregnancy: Benefits & Risks In Telugu)

Written by - Swetha RaoLast updated: Nov 3, 2023
గర్భవతిగా ఉన్నప్పుడు టమాటాలు తినటం : లాభాలు & రిస్కులు (Tomato During Pregnancy: Benefits & Risks In Telugu)
Read time7 min

గర్భవతిగా ఉన్నప్పుడు టమాటాలు తినటం సురక్షితమేనా (Is it Safe to Eat Tomato During Pregancy in Telugu)?

ప్రెగ్నెన్సీ సమయంలో టమాటాలు తినడం సురక్షితమే, కానీ, మితంగా కొద్దికొద్దిగా మాత్రమే తింటూ ఉంటే తల్లి కాబోతున్న మహిళలు అలాగే వారి పుట్టబోయే పిల్లలు టమాటాలలోని విటమిన్ A, C, ఫోలేట్, లైకోపీన్ అలాగే ఐరన్ల నుండి లాభాన్ని పొందుతారు. విటమిన్ C, గర్భవతిగా ఉన్న మహిళలకి అవసరమైన ఐరన్ ని పీల్చుకోవడాన్ని మెరుగుపరుస్తుంది. కడుపుతో ఉన్నప్పుడు, మీ డాక్టరు ఐరన్ సప్లిమెంట్లను తీసుకోవాలని సూచించినట్టయితే, టమాటాలు తినడం వల్ల ఒంట్లోకి ఐరన్ పీల్చుకోబడటం మెరుగుపడుతుంది.

టమాటాల యొక్క పోషక విలువ (Tomato Nutritional Value in Telugu)

ఒక మధ్య సైజులో ఉన్న టమాటాలో 22 కేలరీలు, 5 గ్రాముల కార్బోహైడ్రేట్లు (3 గ్రాముల చక్కెర ఇంకా 1.5 గ్రాముల పీచుపదార్థం) ఉంటాయి. ఇందులో తక్కువ కేలరీలు, కార్బోహైడ్రేట్లు ఉన్నా కూడా, టమాటాల వలన చాలా ఆరోగ్య లాభాలు ముడిపడి ఉన్నాయి.

ఒక చిన్న, 100 గ్రాముల పచ్చి టమాటాలో కింద విధంగా పోషకాలు ఉంటాయి:

  1. కేలరీలు: 18.
  2. నీరు: 95%.
  3. ప్రొటీన్: 0.9 గ్రాములు.
  4. కార్బొహైడ్రేట్లు: 3.9 గ్రాములు.
  5. చక్కెర: 2.6 గ్రాములు.
  6. పీచుపదార్థం: 1.2 గ్రాములు.
  7. కొవ్వు: 0.2 గ్రాములు.

గర్భంతో ఉన్నప్పుడు టమాటాలు తినటం వలన లాభాలు (Benefits of Eating Tomato During Pregnancy in Telugu)

గర్భవతిగా ఉన్నప్పుడు టమాటాని తినడం అనేది చాలా ఆరోగ్య లాభాలని అందించటంతోపాటు, ఏ డైట్ కి అయినా రుచికరమైన పదార్థంగా జతవుతుంది.

1.విటమిన్లు A మరియు C (Vitamin A and C)

ఒక మధ్య సైజు టమాటాలో రోజువారీ కావలసిన విటమిన్ C లో దాదాపు 40% అలాగే విటమిన్ A లో 20% ఉంటుంది.

2. కేలరీలు (Calories)

అదనంగా బరువును మోయాల్సి రావడం వల్ల, గర్భవతిగా ఉన్న మహిళ అలసిపోతూ ఉండవచ్చు. ఇది కూడా ప్రెగ్నెన్సీ యొక్క తరచుగా వచ్చే లక్షణాలలో ఒకటి. టమాటాలలోని తక్కువ క్యాలరీల పదార్థం, గర్భవతిగా ఉన్న మహిళల బలాన్ని పెంచి, అలసటని దూరం చేయడానికి సరిపోతుంది.

3. పీచుపదార్థం (Fiber)

టమాటాలలో పీచు పదార్థం ఎక్కువగా ఉండి జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉండడంలో సహాయపడుతుంది. పీచు పదార్థం మలం యొక్క పరిమాణాన్ని పెంచుతుంది, జీర్ణ ప్రక్రియ జరిగేటప్పుడు (పెరిస్టాలసిస్) కండరాల సంకోచ వ్యాకోచాలు మృదువుగా జరిగేలా ప్రోత్సహిస్తుంది. అలాగే జీర్ణ వ్యవస్థ యొక్క ఎంజైమ్లు ఎక్కువగా స్రవించబడేలా చూస్తుంది.

4. పొటాషియం ( Potassium)

ప్రీఎక్లాంప్సియా లేదా అధిక బిపి ప్రెగ్నెన్సీ సమయంలో తరచుగా వస్తూ ఉంటుంది. అయితే, ప్రెగ్నెన్సీ సమయంలో టమాటాలని క్రమం తప్పకుండా తినడం వల్ల ఈ ప్రమాదం తగ్గుతుంది. వీటిల్లో ఉండే పొటాషియం గుండె నాళాలలో ఒత్తిడిని తగ్గిస్తుంది

5. యాంటీ ఆక్సిడెంట్లు (Anti Oxidants)

టమాటాలలో ఉండే లైకోపీన్ అనే యాంటీ ఆక్సిడెంట్ క్యాన్సర్ ని కలిగించే ఫ్రీ రాడికల్ పదార్థాలకి వ్యతిరేకంగా, ప్రభావవంతంగా పనిచేస్తుంది.

6. ఫోలిక్ యాసిడ్ (Folic Acid)

రోజువారీ తీసుకోవలసిన ఫోలిక్ యాసిడ్ అందటానికి టమాటాలు తినటం అద్భుతమైన మార్గం అని చెప్పవచ్చు. పిండంలో న్యూరల్ ట్యూబ్ అలాగే ఇతర పుట్టుక సమయంలో వచ్చే అసాధారణ లోపాలని నివారించడానికి కూడా ఫోలిక్ యాసిడ్ అవసరం.

7. విటమిన్ E (Vitamin E)

వడదెబ్బలని నివారించటానికి, చర్మం పైన టమాటా రసాన్ని రాసి చూడండి. ఎందుకంటే అందులో విటమిన్ E ఉంటుంది.

కడుపుతో ఉన్నప్పుడు టమాటాలు తినడం వలన వచ్చే రిస్కులు (Risks Of Eating Tomato During Pregnancy in Telugu)

కడుపుతో ఉన్న సమయంలో టమాటాలని ఎక్కువ మొత్తంలో తినడం వలన, ఇతర ఏ ఆహర పదార్థాలు ఎక్కువగా తిన్నా వచ్చే నెగటివ్ ప్రభావాలు దీనికి కూడా వస్తాయి. గర్భ సమయంలో టమాటాని తినడం చాలా లాభాలని అందించినప్పటికీ, మరీ ఎక్కువగా తినడం వలన ఈ కింది పరిస్థితులు ఎదురవ్వచ్చు:

  • టమాటాలు ఆమ్లగుణాన్ని కలిగివుంటాయి, గుండెల్లో మంటని కలిగించవచ్చు.
  • జీర్ణక్రియ సరిగ్గా జరగకపోవటం, కడుపు నొప్పి, ఇంకా గ్యాస్ ఉబ్బరం.
  • గర్భవతి మహిళలలో, పెరుగుతున్న బిడ్డలో రంగు మార్పులు.

టమాటాలని ఎలా ఎంచుకొని & నిల్వచేసుకోవాలి (How to Choose and Store Tomato in Telugu)?

టమాటాలని ఎలా ఎంచుకోవాలి (How to Choose Tomato?)

  • చారలు లేదా ముదురు మచ్చలున్న టమాటాలని తీసుకోవద్దు.
  • టమాటా దాని సైజుకి తగ్గట్టుగా మంచి బరువుగా ఉండాలి.
  • టమాటా గట్టిగా కూడా ఉండాలి, అలాగే మీరు నొక్కితే నొక్కబడేంత మెత్తగా కూడా ఉండాలి.
  • కాండం ఉన్నచోట టమాటా తాజా వాసన రావాలి.

టమాటాలని ఎలా నిల్వ చేసుకోవాలి (How to Store Tomato)

  • టమాటాలని రిఫ్రిజిరేటర్లో నిల్వ చేయవద్దు.
  • చదునైన ఉపరితలం ఉన్నచోట కాండం వైపుని కిందగా పెట్టి టమాటాలని నిల్వ చేయండి.

గర్భంతో ఉన్నప్పుడు టమాటాలని ఆహారంలో ఎలా భాగం చేసుకోవాలి? (How To Add Tomato to Your Diet During Pregnancy in Telugu)

ఏదైనా వంటకంలో టమాటాలని కూడా జత చేయడం అనేది ఆ వంటకానికి దాని యొక్క ఒక ప్రత్యేకమైన రుచిని అందించటానికి అద్భుత మార్గం అని చెప్పవచ్చు. రోజువారీ భోజనాలలో వాటి రుచి అలాగే పోషణని ఎలా జతచేయవచ్చో కింద ఇవ్వబడింది:

  • ప్రెగ్నెన్సీ సమయంలో టమాటాని పచ్చిగా తినడం మంచి పద్ధతే, ఎందుకంటే పచ్చి టమాటాలు సలాడ్ యొక్క సారంగా నిలుస్తాయి.
  • టమాటాలు భారతీయ వంటకాలలో అనేక ప్యూరీలు, కూరలకి వెన్నెముకగా ఉంటాయి.
  • ఒకవేళ కడుపుతో ఉన్న మహిళలు బరువుని నియంత్రించుకుంటుంటే, గర్భసమయంలో టమాటా సూప్ అద్భుతమైన ప్రత్యామ్నాయం.
  • టమాటా జ్యూస్ ని ఎక్కడపడితే అక్కడ నేరుగా తీసుకుని తాగేయవచ్చు లేదా స్నాక్ లేదా బ్రేక్ ఫాస్ట్ తో కూడా తీసుకోవచ్చు.
  • టమాటా ముక్కలని సాండ్విచ్ లకి అద్భుతంగా జత చేయవచ్చు.
  • ఎండలో ఎండబెట్టిన లేదా గ్రిల్ చేసిన టమాటాలు కాంటినెంటల్ వంటకాలలో సర్వసాధారణంగా వాడే పదార్థాలు.

మీకు ఇది కూడా నచ్చుతుంది: ప్రెగ్నెన్సీ సమయంలో ఏం తినాలి?

గర్భంతో ఉన్నప్పుడు టమాటా రసం తీసుకోవడం సురక్షితమేనా? (Is Eating Tomato Safe During Pregnancy in Telugu)?

టమాటా రసంలో విటమిన్ C ఎక్కువగా ఉంటుంది, అందుకని గర్భవతిగా ఉన్నప్పుడు టమాటా రసాన్ని తాగవచ్చు. అలా చేయటం వలన ఒంట్లో జీవశక్తి పెరిగి, అలసట, బలహీనతలు తగ్గుతాయి. వాటితోపాటు, రక్తపోటు క్రమబద్ధీకరించబడుతుంది, రక్తం శుద్ధి చేయబడుతుంది.

గర్భవతిగా ఉన్నప్పుడు క్యాన్లలో నిల్వచేసే టమాటాలని తినడం సరైనదేనా? (Is Eating Tomato in Cans Safe During Pregnancy in Telugu)?

క్యానులలో నిల్వచేసి అమ్మబడే టమాటాలలో బ్యాక్టీరియా పెరిగే అవకాశం ఉండి, బోట్యులిజం లేదా ఇతర వ్యాధులకి దారితీయవచ్చు. సూక్ష్మజీవులని చంపడానికి ఎక్కువ ఉష్ణోగ్రతల వద్ద చేసే క్యానింగ్ ప్రక్రియ సమయంలో టమాటాలలోని పోషకాలు, ఎంజైమ్లు నాశనమయిపోతాయి. ఆహార డబ్బాల లైనింగ్లలో ఉపయోగించే ప్రమాదకర రసాయన పదార్థం బిస్ఫెనాల్ A (BPA) తల్లి, పుట్టబోయే బిడ్డ ఇద్దరికీ హానికరం.

గర్భవతిగా ఉన్నప్పుడు టమాటా కెచప్ లేదా సాస్ ని తినడం సరైనదేనా? (Is it Safe to Eat Tomato Ketchup and Tomato Sause During Pregnancy in Telugu)

కడుపుతో ఉన్నప్పుడు టమాటా కెచప్ అలాగే సాస్ లని తక్కువ మొత్తాలలో తీసుకుంటూ ఉండటం మంచిది. టమాటా కెచప్ అలాగే సాస్ లలో మోనోసోడియం గ్లుటామేట్ (MSG) ఎక్కువగా ఉంటుందనే ఆందోళన కూడా ఉంటుంది. కానీ ఈ మధ్య MSG యొక్క GRAS (సాధారణంగా సురక్షితమని ప్రకటించడం) స్థాయి ప్రకటన వలన, వాణిజ్యపరంగా మార్కెట్లో దొరికే ప్యాక్ చేయబడిన టమాటా కెచప్ అలాగే సాస్ తినవచ్చు.

Tags:

TAGS :

Tomato during pregnancy in telugu, uses of tomato during pregnancy in telugu, Tomato During Pregnancy: Benefits & Risks In English, Tomato During Pregnancy: Benefits & Risks In Hindi, Tomato During Pregnancy: Benefits & Risks In Tamil, Tomato During Pregnancy: Benefits & Risks In bengali

Related Articles

Medical Disclaimer

This content is for informational purposes only and should not replace professional medical advice. Consult with a physician or other health care professional if you have any concerns or questions about your health. If you rely on the information provided here, you do so solely at your own risk.

foot top wavefoot down wave

AWARDS AND RECOGNITION

Awards

Mylo wins Forbes D2C Disruptor award

Awards

Mylo wins The Economic Times Promising Brands 2022

AS SEEN IN

Mylo featured on Business World
Mylo featured on CNBC
Mylo featured on Financial express
Mylo featured on The Economics Times
Mylo featured on Business Today
Mylo featured on Business World
Mylo featured on CNBC
Mylo featured on Financial express
Mylo featured on The Economics Times
Mylo featured on Business Today
Mylo featured on TOI
Mylo featured on inc42
Mylo featured on Business Standard
Mylo featured on YourStory
Mylo featured on ANI
Mylo Logo

Start Exploring

wavewave
About Us
Mylo_logo
At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:
  • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
  • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
  • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.